వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మళ్లీ చర్చలు అవసరం లేదు: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై మళ్లీ చర్చలు అనవసరమని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సమస్య జఠిలం కాకుండా, రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చర్చలకు తమను పిలవలేదని అనడం సరికాదు, గతంలో పిలిచి తన అభిప్రాయం తెలుసుకున్నారని, అందువల్ల ఇప్పుడు పిలవలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆర్టీసీ ఎన్ఎంయూ సమ్మె విరమించడంపై ఆ సంఘం నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమ్మె విరమణ ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలదేనని అయన కొనియాడారు. సకల జనుల సమ్మెను విరమించాలని, సమ్మె కాలంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

English summary
Congress Seemandhra MLA JC Diwakar Raddy said that further consultation on Telangana is not needed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X