వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై నిర్ణయానికి సమయం పడుతుంది: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kirankumar Reddy
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉద్రిక్త పరిస్థితిలో సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ సమస్య జఠిలమైందీ సున్నితమైందీ అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య తన దృష్టిలో ఉందని స్వయంగా ప్రధాని చెప్పారని, సమ్మెను విరమించాలని కోరారని, అందువల్ల సమ్మె విరమించాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం అందరి అభిప్రాయాలు సేకరించిందని, సంప్రదిపులు జరుపుతోందని ఆయన అన్నారు. అన్ని శాఖల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సాగుతోందని, అందువల్ల యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని ఆయన అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

అందరి అభిప్రాయాలు ప్రతిబింబించే విధంగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అన్ని కోణాల నుంచి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఎంత పెద్దవారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. హింసకు దిగితే సహించబోమని ఆయన అన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థలకు ఆటంకం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమ్మె
విరమించాలని ఆయన కోరారు. పోటీ పరీక్షలకు ఆటంకం కలిగించవద్దని ఆయన తెలంగాణ ఆందోళనకారులకు సూచించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను మీరు తెలియజేశారని, ఆ బాధ్యతను నెరవేర్చారని, ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యతను కూడా గుర్తించాలని, అందుకు వెంటనే సమ్మె విరమించాలని ఆయన ప్రభుత్వోద్యోగులను కోరారు. తెలంగాణపై భిన్నాభిప్రాయాలున్నాయని అందరికీ తెలుసునని, దాని జోలికి తాను వెళ్లడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

English summary
CM Kirankumar Reddy said that it takes time to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X