సైఫాబాద్‌లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌పై కేసు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపైన సైఫాబాద్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులను అడ్డుకొని వారిపై దాడులు చేయాలని చెప్పటం హింసను ప్రోత్సహించడమే అవుతుందనేది పలువురి వాదన. మరోవైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు స్వామి గౌడ్, విఠల్‌ల పైనా సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఉద్యమంలోకి వస్తున్నారని వారు చెప్పినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

తమపై కేసులు పెట్టడం శోచనీయమని ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ ఇందిరాపార్కు వద్ద ఉద్యోగుల మహాధర్నా ప్రారంభానికి ముందు అన్నారు. పలువురు పోలీసులు తమ వద్దకు వచ్చి సమ్మెలో పాల్గొంటామని చెబితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని చెప్పి మేమే వద్దన్నామన్నారు. ఈ నేపథ్యంలో ముందు ముందు పోలీసులు కూడా సమ్మెలోకి రావచ్చు, కాబట్టి వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ప్రభుత్వానికి సూచనలు చేసినందుకే తమపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఓ పక్క మాపై కేసులు పెడుతూనే మరోపక్క చర్చలు అంటూ ప్రభుత్వం కపట నాటకం ఆడుతోందన్నారు. సమ్మె నోటీసు ఇచ్చింది తెలంగాణ ఎన్ఎంయు కాబట్టి ఎన్ఎంయు చేసిన ప్రకటనకు అర్థం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+