లోకాయుక్త కోర్టులో లొంగిన యడ్యూరప్ప, జ్యుడిషియల్ కస్టడీ

అంతకు ముందు, భూమి డీనోటిఫికేషన్ కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు లోకాయుక్త కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. యడ్యూరప్పపై కోర్టు శనివారం అరెస్టు వారంట్ జారీ చేసింది. యడ్యూరప్పపై, మరో ఐదుగురిపై నగరానికి చెందిన న్యాయవాది సిరాజిన్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ ఐదుగురిలో యడ్యూరప్ప కుమారులతో పాటు అల్లుడు కూడా ఉన్నారు. బెంగళూర్ దక్షిణ తాలూకాలోని రాచెనహళ్లిలో గల భూమిని డీనోటిఫై చేయడంలో యడ్యూరప్ప ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని, దీనివల్ల ప్రభుత్వానికి 40 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని న్యాయవాది ఆరోపించారు. ఈ కేసులో మాజీ మంత్రి ఎస్ఎన్ కృష్ణయ్య శెట్టి బెయిల్ దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. యడ్యూరప్ప కుమారులకు, అల్లుడికి మాత్రం బెయిల్లు లభించాయి.












Click it and Unblock the Notifications