నిజామాబాద్‌లో కెసిఆర్, కోదండరామ్‌లపై కేసు నమోదు

రైల్వే రోకో సందర్భంగా అరెస్టయిన తెరాస శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి పారిపోయారు. దీంతో పోలీసులు ఆయనను మళ్లీ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద అరెస్టు చేశారు. రైల్ రోకో సందర్భంగా అరెస్టయిన నాయకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. వారిపై కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారు. రైల్ రోకో సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పలువురు తెరాస, కాంగ్రెసు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తాము బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో కెసిఆర్, కోదండరామ్ శనివారం హైదరాబాదులోని తెరాస కార్యాలయంలోనే ఉండిపోయారు. అక్కడి నుంచే తెలంగాణ జిల్లాల్లోని రైలో రోకో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications