వెంబడించి పొన్నం ప్రబాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

వరంగల్ జిల్లాలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను నిర్బంధించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగానే రైళ్లను ఎక్కడం మానేశారని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి రైల్వే స్టేషనులో పోలీసులు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కె. కేశవరావును, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం ఈ ప్రాంత మంత్రులు రాజీనామా చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా మహబూబా బాద్‌లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications