తెలంగాణ రైల్ రోకో: నేతల అరెస్టులు, గృహనిర్బంధాలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ను, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని మానకొండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెరాస నాయకుడు నాయని నర్సింహారెడ్డిని హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలోని ఇంట్లో అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నాయకులకు పోలీసులు గృహ నిర్బంధం విధించారు. సిర్పూర్ శాసనసభ్యుడు కావేటి సమ్మయ్యను గృహనిర్బంధం చేసారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు 20 మంది తెలంగాణవాదులను అరెస్టు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 10 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాదులోని మౌలాలి రైల్వే స్టేషనులో అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా కాజీపేటలో పార్లమెంటు సభ్యుడు రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్‌లో కొప్పుల ఈశ్వర్‌ను గృహనిర్బంధం చేశారు. మందమర్రిలో శాసనసభ్యుడు ఓదేలును పోలీసులు అరెస్టు చేశారు. రామగుండంలో పార్లమెంటు సభ్యుడు వివేక్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications