తెలంగాణపై నవంబర్ 5లోగా తేల్చనున్న కాంగ్రెసు

పార్టీ అత్యున్నత విభాగం సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకున్న తర్వాత యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చలకు ఓ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. అనంతరం జాతీయ, రాష్ట్రస్థాయి అఖిల పక్ష సమావేశాలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఏర్పాటు చేస్తారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మజ్లీస్ తమ వైఖరిని స్పష్టం చేయకపోవడం తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారిందని అంటున్నారు. తమ పార్టీ తెలంగాణపై వైఖరిని స్పష్టం చేసిన తర్వాత ఆ పార్టీలు కూడా స్పష్టమైన వైఖరి చెప్పేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది.
తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత సంభవించే పరిణామాలకు తమ పార్టీ బాధ్యత వహించేలా కాకుండా అందరి ఆమోదంతోనే నిర్ణయం చేసి అందరిని అందుకు బాధ్యులను చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తెలంగాణపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేసి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలని ఇటీవలి పార్టీ కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించినట్లు సమాచారం. ఆ సూచన మేరకే చర్చల ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications