బాన్సువాడ ఉప ఎన్నిక: కాంగ్రెసుకు సెటిలర్ల అండ?

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస గౌడ్ సాధించిన ఓట్లకు కాంగ్రెసు నాయకత్వం గొప్పలు పోతోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దాన్ని గొప్పగా చెప్పుకుని తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి బాగుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాన్సువాడ శాసనసభా నియోజకవర్గంలోని ఓటర్ల సమీకరణాలు చేయకపోవడం వల్లనే కాంగ్రెసు నేతలు గొప్పలు చెబుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. శ్రీనివాస గౌడ్‌కు 33 వేల ఓట్ల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ మనోభావాలు తీవ్రంగా ఉన్న స్థితిలో డిపాజిట్ కూడా దక్కుతుందా లేదా అనే అనుమానంతోనే కాంగ్రెసు నాయకత్వం అభ్యర్థిని రంగంలోకి దింపింది. తమ అభ్యర్థికి డిపాజిట్ దక్కడం ఊరటనిచ్చే విషయమే. అయితే స్థానిక పరిస్థితులు చూస్తే కాంగ్రెసు నాయకులు సంతోషించడానికి ఏమీ లేదని అంటున్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని ఓటర్లలో సీమాంధ్ర సెటిలర్లు, మైనారిటీలు కలిపి 35 వేలకు పైగా ఉంటారని సమాచారం. నిజానికి, నిజామాబాద్ జిల్లాలో సీమాంధ్ర నుంచి చాలా ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిననవారి సంఖ్య పెద్దగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో మండవ వెంకటేశ్వర రావు పోటీ చేసి గెలిచే స్థాయికి వచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా సెటిలర్లు బాన్సువాడలో కాంగ్రెసు అభ్యర్థికి ఓటేసినట్లు భావిస్తున్నారు. అలాగే కొంత మంది మైనారిటీలు కూడా కాంగ్రెసుకు అండగా నిలిచినట్లు సమాచారం. మైనారిటీలు చాలా వరకు కాంగ్రెసుకు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అందుకే, శ్రీనివాస గౌడ్ లెక్కించదగ్గ స్థాయిలో ఓట్లను సాధించారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+