తెలంగాణ వంట చేసినంత ఈజీ కాదు: రేణుకా చౌదరి

ఏమైనా ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అందరితోనూ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి, సంబంధిత వ్యక్తులంతా కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే అంతర్గతంగా ఏమి చర్చిస్తున్నామో కాంగ్రెస్ బహిరంగంగా చెప్పబోదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆందోళన చేసే హక్కు అధికారం అందరికీ ఉందని కాని సమాజంలో ఏ వర్గమూ గాయపడకుండా, నష్టపోకుండా, దారి తప్పకుండా చూసుకోవాలన్నారు.
నవంబర్ 5 లోగా నిర్ణయం వెలువడుతుందన్న వార్తల్ని ప్రస్తావించగా తనకు తెలియదని చెప్పారు. దీపావళి పండుగకు చీకట్లు తొలగి, అందరూ కలసి వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. బాన్సువాడ ఉప ఎన్నికలపై స్పందిస్తూ గెలుపు ఓటములనేవి ప్రజాస్వామ్యంలో సహజమన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆ మాత్రం ఓట్లు రావటం గొప్ప విషయమని తెలిపారు. సీఎం, గవర్నర్‌లు ఢిల్లీ వచ్చిన తర్వాత సమ్మెను అణచి వేస్తున్నారన్న వ్యాఖ్యల్ని ఆమె కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications