యడ్యూరప్ప బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మధ్యంతర బెయిల్ పిటిషన్ అయినందు వల్ల దీనిపై విచారణను త్వరగా ముగించాల్సి ఉంటుందని యడ్యూరప్ప తరఫు న్యాయవాది రవి బి నాయక్ అన్నారు. యడ్యూరప్పకు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఈ నెల 15వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యడ్యూరప్పపై బాషా అనే న్యాయవాది ఐదు ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యడ్యూరప్పను మంగళవారం సాయంత్రం డిశ్చార్జీ చేసే అవకాశం ఉందని జయదేవ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సిఎన్ మంజునాథ్ చెప్పారు.












Click it and Unblock the Notifications