హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమర్శలకు కాలమే సమాధానం చెప్తుంది: జానారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
హైదరాబాద్: తనపై వస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని మంత్రి జానారెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో జాప్యం వల్లే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తన వ్యాఖ్యల పైనా తానెవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తనకూ ఎవరూ చెప్పవలసిన అవసరం లేదన్నారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో నిరసనలో భాగంగా తాను సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుండే విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఆమరణ దీక్షల ద్వారా సాధించేదేమీ లేదన్నారు. దీక్షలతో కాకుండా ప్రజా పోరాటాలతో తెలంగాణ సాధించుకుందామని సూచించారు. సిపిఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివ రావు తన ఆరోగ్యం దృష్ట్యా వెంటనే నిరాహార దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను నెరవేర్చాలని తాను అనునిత్యం ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై వేసిన కేసు నిలవదన్నారు. తెలంగాణ ప్రాంతంలోనూ ఉద్యమకారులపై పెట్టిన కేసులు నిలిచేవి కావని వాటి విషయంలో భయాందోళన చెందవద్దని సూచించారు. తెలంగాణ సాధన కోసం కేంద్రంపై పలురూపాల్లో ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తాము ఆత్మరక్షణలో పడ్డామనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిని ప్రజలు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పారు.

English summary
Minister Jana Reddy responded today about Telanganites comments about him. He hoped that time will come to prove his commitment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X