అద్వానీ రథయాత్రలో తెరాస ఎంపి విజయశాంతి

అద్వానీని విజయశాంతి కలవడంలో ఏ విధమైన తప్పు లేదని తెరాస శాసనసభ్యుడు కెటి రామరావు ఇది వరకే చెప్పారు. అద్వానీ తన తెలంగాణ యాత్రలో ప్రధానంగా తెలంగాణ అంశంపైనే మాట్లాడారు. ఆయన బుధవారం వివిధ ప్రాంతాల్లో తెలంగాణపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెసుపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడిందని విమర్శించారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును యుపిఎ ప్రభుత్వం ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications