స్పందిస్తున్న ఒకే ఒక్కడు జగన్!: వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma
హైదరాబాద్: రాష్ట్రంపై ప్రభుత్వం నిష్క్రియాతత్వం ప్రదర్శిస్తుంటే ప్రతిపక్షం దానికి మద్దతు పలుకుతోందని ఈ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై స్పందిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం పార్టీ కార్యాలయంలో అన్నారు. జగన్ ప్రజల్లో తిరుగుతూ రైతుల సమస్య గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని, అవసరమైనప్పుడు దీక్షలు, ధర్నాలు, నిరసనలూ చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడానికే పరిమితమవుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, డెంగ్యూ మరణాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాష్ట్ర ప్రజల కష్ట నష్టాలు పట్టనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా నిమ్మకు నీరెత్తినట్లున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏం చేయలేని స్థితిలో ఉంటే ప్రతిపక్షం వారితో చేతులు కలిపిందన్నారు. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితిల్లో ఉంటే అసెంబ్లీని సమావేశపర్చాలని టిడిపి ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకున్నారో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ అలాగే చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి కీలుగుర్రంలా మారిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+