హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం, బొత్స ఛలో ఢిల్లీ: కాంగ్రెసు నేతల హస్తిన దారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయంతో హస్తిన మరోసారి వేడెక్కనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బాట పట్టనున్నారు. రైలు రోకోలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులపై రైల్వే యాక్టు ప్రకారం కేసు పెట్టి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో సిఎంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెసు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి తమపై కక్ష గట్టి అరెస్టులు చేయించారని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే త్వరగా తెలంగాణ అంశాన్ని తేల్చాలని వారు కోరనున్నారు.

తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శాసనమండలి స్థానం ఖాళీ కావడంతో ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ దీనిపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు 24వ తేది వరకు గడువు ఉంది. గడువు మరెంతో దూరం లేక పోవడం, ఈ స్థానంపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకోవడంతో దానిపై చర్చించనున్నారు. బొత్స, కిరణ్ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదుతో భేటీ అయి మండలి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం ఉంది. ఇందులో తెలంగాణపై చర్చించనున్నారు.

English summary
CM Kiran Kumar Reddy, PCC chief Botsa Satyanarayana will go New Delhi today evening. Telangana MPs already in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X