హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెటిలర్స్‌ పైన టిఆర్ఎస్ వైఖరి మారుతోందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఉన్న సెటిలర్స్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరి క్రమంగా మారుతోందా అంటే అవునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ తమ సోదరులే అని ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పే తెరాస వ్యాఖ్యల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు ఇటీవల బాన్సువాడ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలే నిదర్సనంగా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో సెటిలర్స్ తెలంగాణ ద్రోహులకు ఓటు వేశారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పోచారం వ్యాఖ్యలు ఇలా ఉంటే బాన్సువాడ ఉప ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయని వారిని ఊరు విడిచి వెళ్లాలని కొందరు ఆల్టిమేటం జారీ చేశారని సమాచారం.

తెలంగాణవాదాన్ని ఎవరూ కాదనలేరు. కానీ స్వతంత్ర భారత దేశంలో ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకునే హక్కు లేదాను పలువురు ప్రశ్నిస్తున్నారు. తెరాసకు ఓటు వేయని సెటిలర్స్‌ను గ్రామం విడిచి వెళ్లాలనే వాదనల నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని కాలరాచేలా తెలంగాణవాదులు వ్యవహరిస్తున్నారని, ఇప్పుడే ఇలా హెచ్చరిస్తే తెలంగాణ వస్తే సీమాంధ్రులకు తెలంగాణలో ఎలాంటి భయం ఉండదని ఎలా నమ్మగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కూకట్‌పల్లిలో తెరాస పోటీ చేయనప్పటికీ అక్కడ కాంగ్రెసుపై తెదేపా గెలుపొందడంతో అక్కడి సెటిలర్స్ పైన పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే బాన్సువాడలో తెదేపా పోటీ చేయనప్పటికీ కాంగ్రెసుకు ఆశించిన మెజార్టీ రావడంతోనూ ఆయన మండిపడ్డారు. అయితే తెలంగాణ వాదం ప్రజల్లో బలంగా ఉన్న సమయంలోనూ సెటిలర్స్ అందుకు అనుకుణంగా నడవక పోవడాన్ని తెలంగాణవాదులు తప్పుపడుతున్నారు.

English summary
It seems, Telangana Rastra Samithi stand is changed on settlers. Bansuwada MLA Pocharam Srinivas Reddy statements proving that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X