హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఇంటికి అనుమతి పత్రం లేదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులోని ఇంటికి నివాస యోగ్య అనుమతి పత్రం ఇంకా ఇవ్వలేదని తెలుస్తోంది. నివాస ధృవీకరణ పత్రం కొరకు గతంలో జగన్ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్పటికీ అక్కడ ఇంకా భవనం పూర్తి కాకపోవడంతో అనుమతి పత్రం జారీ చేయలేదని సమాచారం. అనుమతి పత్రం ఇంకా జారీ చేయనందున ఇంటి నిర్మాణంలో ఏవైనా అక్రమాలు జరిగాయా అనేది గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల దృష్టికి రాదు. అనుమతి పత్రం జారీ చేసే సమయంలో అన్నీ పరిశీలిస్తారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికున్న సమయంలో మొదటిసారి 2008లో వారు ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారని, 2010లో ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రికార్డులను జిహెచ్ఎంసీ అధికారులు సిబిఐకి అప్పగించారు కూడా. కాగా మొదటిసారి ఆ భవనం కోసం సవ్యంగా అనుమతులు తీసుకున్నప్పటికీ రివైజ్డ్ ప్లాన్‌లో తప్పటడుగులు వేసినట్లు తెలుస్తోంది. రివైజ్డ్ ప్లాన్‌కు అనుమతులు లేవని సమాచారం.

English summary
It seems, GHMC did not gave occupancy certificate to YSR Congress party president YS Jaganmohan Reddy's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X