గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు చెక్, ప్రత్యామ్నాయాలపై కాంగ్రెసు దృష్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ఓ వైపు ఓదార్పు యాత్ర చేస్తుంటే మరోవైపు కాంగ్రెసు పార్టీ ఆయన దూకుడుకు చెక్ చెప్పే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వారం రోజులుగా గుంటూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే జిల్లా కాంగ్రెసు శాసనసభ్యులు సుచరిత, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జగన్‌కు మద్దతుగా రాజీనామాలు సమర్పించారు. అయితే తెలంగాణలో సకల జనుల సమ్మె తదితర కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు కాంగ్రెసు జగన్ వర్గంపై దృష్టి సారించలేదు. తెలంగాణలో సమ్మె క్రమంగా తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో కాంగ్రెసు ఇక జగన్ వర్గం ఎమ్మెల్యేలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. ఇందులో భాగంగా ఆయన ఓదార్పు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లాలో శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించక పోవటంతో ఇప్పటి వరకు వారు తమ మనసు మార్చుకుంటారేమోనని ఎదురు చూసినట్లుగా కనిపిస్తోంది. కానీ వారు ఓదార్పు యాత్రలో పాల్గొనటంతో ఉపేక్షించవద్దని కాంగ్రెసు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

సుచరిత, పిన్నెల్లి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని బలపరిచేందుకు చర్యలు ప్రారంభించింది. మొదటి నుండి జగన్‌కు మద్దతు పలుకుతున్న పిన్నెల్లిపై మొదట దృష్టి సారించింది. ఆయన నియోజకవర్గంలో ఖాళీ ఐన మార్కెట్ యార్డు ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పిన్నెల్లి వ్యతిరేక వర్గానికి కట్టబెట్టారట. తద్వారా కాంగ్రెసును బలపర్చేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. ఇక సుచరిత నియోజకవర్గం ఐన ప్రత్తిపాడులోనూ ఇంచార్జులను నియమించేందుకు కాంగ్రెసు కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గ వ్యవహారాలు ఎంపీ రాయపాటి సాంబశివ రావు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చూస్తున్నారు. ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పనుల కోసం వీరిద్దరినే కలుస్తున్నారట. దీంతో ఇప్పటికే సుచరిత హవాకు గండి కొట్టినట్లయింది. ఇక ఇంచార్జులను నియమిస్తే ఆమె హవా మరింత తగ్గించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
Congress is thinking they will stop YSRC Party president YS Jaganmohan Reddy by announce alternate leaders at his mlas constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X