కెసిఆర్ కుటుంబం కోసమే ఉద్యమం: సీమ నేతలు

రాష్ట్రం కోసం తాము రాజధానిని త్యాగం చేశామన్నారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ తదితరులు అనవసర అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని నిర్ణయించుకున్నారు. వచ్చే 12 పంచవర్ష ప్రణాళికలో 2 శాతం నిధులు సీమకు కేటాయించాలని డిమాండ్ చేయాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేదంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. 2009 డిసెంబర్ నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం సమైక్యతకు కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్ారు. సమైక్య రాష్ట్రంలోనే తెలుగు ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. మంత్రులు టిజి వెంకటేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, అబ్దుల్ ఘని, శ్రీకాంత్ రెడ్డి, బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కెయి ప్రభాకర్, కెయి కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, మీనాక్షి నాయుడు, మైసూరా రెడ్డి, నిమ్మల కిష్టప్ప, చెన్నకేశవ రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, ఏడు సూత్రాల కమిటీ చైర్మన్ తులసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications