Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరి

kadiyam srihari
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఆప్తుడిగా ఉండిన వ్యక్తియే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నమస్తే తెలంగాణ పత్రికకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు కడియం శ్రీహరి శనివారం ఆరోపించారు. ఎన్టీఆర్ భవనంలో పోలవరం విషయంలో తెరాస పైన చేసిన తాము ఆరోపణలకు ప్రూఫులుగా కొన్ని డాక్యుమెంట్లను మీడియా ముందుకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు జలయజ్ఞం వ్యవహారాల్లో రాజం కీలక పాత్ర పోషించారు. వైఎస్ సలహాదారు కెవిపి రామచంద్రరావుతో కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టుల టెండర్ల సెటిల్మెంట్లు చేసి ముఖ్యమంత్రికి ముడుపులు ముట్ట చెప్పారని, ఆ రకంగా ఆయన వైయస్‌కు కూడా ఆప్తుడయ్యాని ఇప్పుడు ఆయనే నమస్తే తెలంగాణ పత్రికకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారని ఆరోపించారు. ఆయన ఇంటర్ కాంటినెంటల్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్ అనే కంపెనీని పెట్టి జలయజ్ఞం కాంట్రాక్టర్లతో అందులో షేర్లు కొనిపించారని ఆరోపించారు.

ముడుపులను నేరుగా తీసుకోకుండా ఇలా పెట్టుబడులు పెట్టించారన్నారు. ఇంటర్ కాంటినెంటల్ కంపెనీకి కూడా రాజమే సీఎండీ అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ పెట్టిన నమస్తే తెలంగాణ పత్రికకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రాజం మధ్యవర్తిత్వంతోనే పోలవరం టెండర్లు స్యూ కంపెనీకి దక్కాయని, సిఎం కిరణ్‌తో రాజం భేటీ తర్వాతే అర్హత నిబంధనలు సడలించి స్యూ కంపెనీకి ఈ టెండర్లు కట్టబెట్టారని, స్యూ కంపెనీ డబ్బులనే తీసుకొచ్చి రాజం నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారాలన్నీ కెసిఆర్‌కు తెలియకుండానే జరిగాయా అని ప్రశ్నించారు. అందుకే పోలవరం టెండర్లు ఖరారు కాగానే ఆ ప్రాజెక్టును కీర్తిస్తూ నమస్తే తెలంగాణ పత్రికలో వార్త వచ్చిందన్నారు. తమ ఆరోపణలపై ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, దానికి ముందు తన పత్రికకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చిందీ... ఎవరు ఎంత ఇచ్చింది బహిర్గతం చేయాలని కెసిఆర్‌ను డిమాండ్ చేశారు.
స్యూ కంపెనీ మొదట ఈ ఇంటర్ కాంటినెంటల్ కంపెనీలో కొన్ని షేర్లను మొదట ఓ ధరకు ఆ తర్వాత మరో ధరకు పెట్టిందన్నారు. రెండోసారి పెట్టిన మొత్తం డబ్బును రాజం తెచ్చి ఇంటర్ కాంటినెంటల్ కంపెనీ పేరుతో నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడిగా పెట్టారు.

జగన్ పత్రిక సాక్షిలో పెట్టుబడుల సమీకరణకు ఎలాంటి మార్గాలు అవలంబించారో ఇక్కడా అవే కనిపిస్తున్నాయి. దీనికి తెరాస నేతలు సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కడితే రక్తం ఏరులై పారుతుందని హెచ్చరికలు చేసిన పార్టీకి చెందినవారే ఇప్పుడు ఆ ప్రాజెక్టు టెండర్ల ఖరారులో కీలక పాత్ర వహించడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ప్రభుత్వం విధించిన అర్హత నిబంధనలు స్యూ కన్సార్షియంకు లేవని, ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినట్లు ఒక సర్టిఫికెట్ తెచ్చి ఈ కంపెనీ ఇచ్చిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం వద్ద చేసిన పనులకు సంబంధించిన అనుభవం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని, ఆ ప్రైవేటు కంపెనీ పని అనుభవం కూడా దొంగ సర్టిఫికెట్ అని ఆరోపించారు. పోలవరంకు తాము వ్యతిరేకం కాదని అందులో జరిగే అవినీతికి వ్యతిరేకమన్నారు. అదే సమయంలో డిజైన్ కూడా మార్చాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+