జగన్ పెంపకంలో లోపం: వైయస్‌పై పిసిసి చీఫ్ బొత్స

మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌కు శాసనమండలి స్థానం కేటాయించడానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్సీ సీటు నిర్ణయం ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా జరిగిందన్నారు. కాంగ్రెసు పార్టీలో అర్హులైన వారందరికీ ఎప్పుడైనా పదవులు వస్తాయన్నారు. డిఎస్ ఎన్నిక ఢిల్లీలో జరగలేదని రాష్ట్ర స్థాయిలోనే జరిగిందన్నారు. డిఎస్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా ఆయనను పదవి వరించిందన్నారు. కాంగ్రెసులో ప్రతి ఒక్కరూ పదవులకు అర్హులేనని అవసరమైనప్పుడు అవి వరిస్తాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాగానే పని చేస్తున్నారని కాబట్టి సిఎం మార్పుపై చర్చ అప్రస్తుతమని చెప్పారు. సిఎం మార్పు జరిగితే డిఎస్ ఒక్కరే ఉన్నారా కాంగ్రెసులో చాలా మంది అర్హులున్నారన్నారు.
పోలవరం విషయంలో పార్టీ, ప్రభుత్వం వాయిస్ ఒకే విధంగా ఉండాలన్నారు. ఎవరైనా వేరే విధంగా చెప్పిన అది వ్యక్తిగత అభిప్రాయమే అవుతుందన్నారు. సకల జనుల సమ్మె పూర్తయిన తర్వాత పరిస్థితులు సద్దుమణుకుతాయని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆశావాహులకు ముందు ముందు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తే మంచిదన్నారు. మంత్రి టిజి వెంకటేష్ ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంపై వివరణ కోరతామన్నారు. తాను సిఎంను రోజూ కలవాలని నిబంధన లేదన్నారు.












Click it and Unblock the Notifications