తెలంగాణపై ప్రశ్న: మీడియాపై డిఎస్ సీరియస్

అదే సమయంలో అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మల్సీ స్థానాన్ని కేటాయించినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, తనకు ఎమ్మెల్సీ దక్కడానికి కృషి చేసిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన సేవలు గుర్తించి సీటు కేటాయించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్టీలో ఇది తనకు గుర్తింపే అన్నారు. కాగా డిఎస్‌కు మంత్రులు టిజి వెంకటేష్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అనీల్ అభినందనలు తెలియజేశారు. డిఎస్‌కు ఎమ్మెల్సీ దక్కడంపై కాంగ్రెసు వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications