హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఇంటి అనుమతులపై ప్రభుత్వం ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. లోటస్ పాండులోని జగన్ ఇంటి అనుమతి వివరాలపై నివేదిక ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను ప్రభుత్వం సోమవారం కోరింది. జగన్ నివాసానికి అనుమతిచ్చిన ధనుంజయ రెడ్డి కార్యకలాపాలపై కూడా ప్రభుత్వం నివేదిక కోరింది. లోటస్ పాండులోని జగన్ ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 2008లో దరఖాస్తు చేసుకున్నారు. 2010లో మొదటిసారి ఇంటి ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి ఇచ్చిన ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని, జగన్ ఇంటికి అనుమతులు లేవని అంతేకాకుండా జగన్‌కు నివాస యోగ్య అనుమతులు కూడా లేవనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం జిహెచ్ఎంసిని నివేదిక కోరింది.

కాగా జగన్‌కు చెందిన లోటస్ పాండులో ఇంటి నిర్మాణ అంచనా నాలుగో రోజూ కొనసాగుతోంది. సిబిఐ, జిహెచ్ఎంసి అధికారులు జగన్ ఇంటి నిర్మాణ వ్యయంపై అంచనా వేస్తున్నారు. సోమవారంతో జగన్ ఇంటి పరిశీలన ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ సోదరి షర్మిళా ఇంట్లోనూ సిబిఐ కొలతలు తీసుకుంది. జగన్ అస్తుల కేసు విషయంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డి ఉదయం సిబిఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు మైన్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ కూడా సిబిఐ ముందు హాజరయ్యారు.

English summary
State government is enquiring on YSRC Party president YS Jaganmohan Reddy's lotus pond from GHMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X