నీ ఊరెళదామా?: రాధాకృష్ణకు జగన్ నేత మరో సవాల్

తమ సవాల్‌కు ముందుకు రాకుంటే తప్పుడు సమాచారం కారణంగా అలా ప్రసారం చేశామని తప్పు ఒప్పుకుంటే బాగుంటుందన్నారు. ఎబిఎన్ వాడిన భాష చూస్తుంటే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉందన్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. అందరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆంధ్రజ్యోతి కేవలం దమ్ము మాత్రమే కాదని దగ్గు సకల రోగాలున్న ఛానల్ అన్నారు. రాధాకృష్ణ తోటి పత్రిక అని చూడకుండా ఈనాడును కూడా అవమానించారన్నారు. జగన్‌కు జనసంద్రంలో ఉండటానికే సమయం చిక్కడం లేదు. ఇక ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ కట్టించుకొని ఈత కొట్టడానికి సమయమెక్కడిదన్నారు. మమ్మల్ని పెంపుడు జంతువులతో పోల్చడం దిగజారుడుతనమన్నారు. అసలు రాధాకృష్ణది జర్నలిజమే కాదన్నారు.












Click it and Unblock the Notifications