కెసిఆర్‌కు పోలవరం మకిలి: ఇరుకునపడ్డ బిజెపి

BJP
హైదరాబాద్: పోలవరం టెండర్ల అంశంలో తెలంగాణ రాష్ట్ర సమితిపై నీలినీడలు కమ్మకోవడంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిలో ఉండి తెరాసతో పాటు ఉద్యమిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇరుకున పడ్డట్లుగా కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోనట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ జెఏసి లో ప్రధాన భాగస్వామి అయిన టిఆర్ఎస్ నుంచి చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న బిజెపికి పోలవరం టెండర్ల వ్యవహారం మరో తలనొప్పిలా వచ్చి మారింది. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న తర్జనభర్జన ప్రారంభమైంది. పార్టీకి మకిలి అంటకముందే కఠిన నిర్ణయం తీసుకోవాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. నిజానికి, పోలవరంతో తెలంగాణకు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్ విద్యాసాగర్‌రావు, ఇతర నేతలు పలు వేదికలపై బాహాటంగానే వ్యాఖ్యానించారు.

పార్టీ కూడా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు, నిర్వాసితులకు సమాన విలువైన భూమి కేటాయింపు వంటి డిమాండ్లు చేస్తూ వచ్చింది. తీరా టెండర్లు దక్కించుకున్న కంపెనీతో టిఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందన్న ఆరోపణలు బిజెపిని కూడా ఇరుకున పెడుతున్నాయి. ఏ ప్రజల కోసమైతే ఉద్యమిస్తున్నామో అదే ప్రజలకు నష్టం చేకూర్చే ప్రాజెక్టు టెండర్లను జెఏసిలో తమ భాగస్వామి దక్కించుకోవడాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెబుతూనే పోలవరాన్ని దక్కించుకున్న టిఆర్ఎస్ గురించి ప్రశ్నిస్తే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి.

తెలంగాణవాసులకే అన్యాయం చేసే టెండర్లను దక్కించుకున్న టిఆర్ఎస్ నేతలతో మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా మళ్లీ టీఆర్ఎస్‌తో జట్టు కట్టి ఉద్యమిస్తే తమ పార్టీని ప్రజలు నమ్ముతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ టెండర్ల గుట్టును బయట పెట్టాలంటే టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయక తప్పదు. టార్గెట్ చేస్తే జేఏసీలో తమ పార్టీకి చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అంటే ప్రస్తుతం బిజెపి పరిస్థితి ఎటూ పాలుపోని విధంగా తయారైంది. అయితే గత కొంతకాలంగా జెఏసి నుండి బయటకు వచ్చి ఉద్యమించాలన్న ఆలోచన కూడా బిజెపిలో ఉన్నట్లుగా వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+