తెలంగాణ ఎఫెక్ట్: బెజవాడలో రియల్ ఎస్టేట్ బూమ్

Telangana Map
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగంలో నిరుడు ఇదే సమయంతో పోలిస్తే విజయవాడ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రూ. 17.88 కోట్ల ఆదాయం పెరిగింది. ఈ మేరకు ఓ ఆంగ్లదినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. గత కొంత కాలంగా విజయవాడ డిల్లా పరిధిలోని నున్నా, ఇబ్రాహీం పట్నం, నాన్ - డిగ్మాల్లో భూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. విజయవాడ పరిధిలోని ఏడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఆదాయాన్ని చూస్తే - ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాటి ఆదాయం రూ.77.88 కోట్లు కాగా, నిరుడు ఇదే కాలంలో రూ. 60 కోట్లు ఉందని అర్థమవుతోంది.

నున్నాలో భూ క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బైపాస్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణాల వల్ల ఇక్కడి భూములకు గిరాకీ పెరిగింది. భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనే అంచనాతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నందిగామలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారు. విజయవాడ - నందిగామ హైవేను ఫోర్ లేన్స్‌గా మారుస్తున్నారు. దీంతో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు ప్రయాణం సులభమవుతుంది. రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రులు నందిగామలో నివసిస్తూ తమ వ్యాపారాలు చూసుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లి వస్తుండవచ్చు.

విమానాశ్రయం, ఐటి పార్కు విద్యాసంస్థల వంటివి భూములపై కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి వెంచర్లుగా మార్చడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే భూముల రేట్లు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే ఇళ్ల స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. బంగారంపై, షేర్లపై పెట్టుబడులు పెట్టడం కన్నా భూములపై పెట్టుబడులు పెడితే భద్రమనే భావన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడానికి కారణమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+