లవర్ అప్పు తీర్చుటకు కజిన్‌ను కిడ్నాప్ చేసిన అమ్మాయి

Gujarat
అహ్మదాబాద్: ఇరవయ్యేళ్ల అమ్మాయి తన ప్రేమికుడి అప్పు తీర్చడానికి తన ఐదేళ్ల కజిన్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మణినగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని మానసరోవర్ హోటల్ యజమాని భారత్ బాల్‌చందాని తనయుడు ఐదేళ్ల ఆదిత్య మంగళవారం కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్ చేసిన వారు బాల్‌చందానికి ఫోన్ చేసి రూ.1కోటి డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బాల్‌చందాని ఇంట్లో ఉంటున్న బంధువు పాయల్ కూడా ఉంది. పాయల్ తన బాయ్ ఫ్రెండ్ నిషాంత్ సేథ్ రూ.పది లక్షల అప్పు తీర్చడానికి ఆదిత్యను కిడ్నాప్ చేసింది.

అయితే మెడిసిన్స్ తీసుకు రావడానికి వెళ్లిన పాయల్, ఆదిత్య ఇద్దరు ఇంటికి రాకపోవడంతో బాల్‌చందాని మొదట ఇద్దరు కిడ్నాప్‌కు గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ తర్వాత మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బాల్‌చందానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు పక్కా వ్యూహంతో ఫోన్ ట్రేస్ చేశారు. నిందితులు మొదట కోటి రూపాయలు డిమాండ్ చేయడం బాల్‌చందాని తగ్గిస్తూ చర్చలకు దిగడం వల్ల పోలీసులకు ఫోన్ నంబర్లు ట్రేస్ చేయడం ఈజీ అయింది. కిడ్నాపర్లు చివరకు రూ.25 లక్షలకు దిగి వచ్చారు. ఇరవై లక్షలు జ్యువెల్లరీ, రూ.5 లక్షలు నగదు రూపంలో తీసుకోవడానికి ఒప్పుకున్నారు.

ఇద్దరు వ్యక్తులు డబ్బు తీసుకోవడానికి వెళ్లిన సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ సమయంలో పాయల్ అక్కడే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. పోలీసులు విచారించడంతో ఆమె బండారం బయటపడింది. డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా ఆదిత్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని ప్రశ్నించడంతో గుజరాత్ కళాశాల సమీపంలోని వాల్ స్ట్రీట్ బిల్డింగ్‌లోని ఏడో ఫ్లోర్‌లో ఆదిత్యను ఉంచినట్లు తేలింది. అక్కడకు వెళ్లగానే పాయల్ లవర్ నిషాంత్ ఆదిత్యకు గార్డులా నిలబడి కనిపించాడు. పోలీసులు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+