ఆమరణ దీక్షకు కోదండరామ్, స్వామి గౌడ్ రెడీ?

తెలంగాణ ప్రజాప్రతినిధుల 72 గంటల నిరవధిక నిరాహార దీక్షల తర్వాత తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని కోదండరామ్, స్వామి గౌడ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 1వ తేదీ నుంచి 72 గంటల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు నిరవధిక నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ దీక్షల్లో తెరాస శాసనసభ్యులతో పాటు బిజెపి, సిపిఐ, తెలంగాణ నగారా శాసనసభ్యులు పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే, తాము 72 గంటల నిరాహార దీక్షను నిరవధిక దీక్షలుగా మారుస్తామని తెరాస శాసనసభ్యులు అంటున్నారు. తెరాస శాసనసభ్యుల నిరవధిక నిరాహార దీక్షలను దృష్టిలో పెట్టుకునే కోదండరామ్, స్వామిగౌడ్ ఆలోచనపై కెసిఆర్ మాట్లాడడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications