ప్రతి ముగ్గురు కేరళవాసుల్లో ఒకరు మహానగరంలో

2011వ సంవత్సరంలో కేరళలో కొచ్చి, కోజీకోడ్, త్రిసూర్, మలప్పురం, తిరువనంతపురం, కన్నూరు, కొల్లాం తదితర పట్టణాలు మిలియన్ ప్లస్ నగరాలుగా ఉన్నాయి. దేశంలోనే పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌తో పోల్చుకుంటే కేరళలో పలు నగరాలు మిలియన్ ప్లస్ ప్రజలను కలిగి ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కేవలం 7శాతం ప్రజలు మాత్రమే మిలియన్ ప్లస్ నగరాలలో నివసిస్తున్నారు. ఇది 2001లో ఆరు శాతం. అంటే యుపి నగరీకరణలో పెద్దగా మార్పు లేదు. హర్యానా, బీహార్ రాష్ట్రాలలో అతితక్కువ నిష్పత్తిలో ప్రజలు నగరాలలో ఉంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బంగా రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాలలో ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్రాలలో నగరీకరణ కేరళ కంటే తక్కువ శాతం నమోదు కావడం విశేషం. కాగా గత పదేళ్లలో మిలియన్ ప్లస్ జన సంఖ్య కలిగిన నగరాలు బాగా పెరిగాయి.












Click it and Unblock the Notifications