ముంబై: తూటాలు కలిగి ఉన్నందున ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు శనివారం తెల్లవారుజామున చత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఇరవై మూడేళ్ల నూరత్ టి అనే మహిళ ముంబై నుండి నేపాల్ వెళ్లడానికి ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానాశ్రయ భద్రతాధికారులు తనిఖీ చేసినప్పుడు ఆమె వద్ద కొన్ని తూటాలు దొరికాయి. దీంతో భద్రతా సిబ్బంది ముంబై పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి ఆమెన అరెస్టు చేశారు.
ఆమె వద్ద నుండి తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పినప్పటికీ ఎన్ని స్వాధీనం చేసుకున్నారో ఖచ్చితంగా చెప్పలేదు. పోలీసుల సమాచారం మేరకు ఆమె తన స్నేహితులతో కలిసి భారత దేశ పర్యటనకు వచ్చింది.