గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారు లెక్కలెలా కట్టగలరు?: మెడిసిన్ ఎంట్రెన్స్‌పై జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: ఎంసెట్ నుండి మెడిసిన్ ఎంట్రెన్స్ తీసేసి జాతీయ స్థాయి ఎన్ఈఈటి పరీక్ష ద్వారా నిర్వహించాలనే నిర్ణయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మన రాష్ట్రంలో ఇంటర్మీడియేట్‌లో బైపిసి చదువుతున్న విద్యార్థులకు మెడిసిన్ సీట్ రావాలంటే ఇక ఢిల్లీ వారు పెట్టే ప్రవేశ పరీక్షలు రాయాలని, ఇప్పటి వరకు సైన్స్ విద్యార్థులకు ఎంసెట్‌లో సైన్సు సంబంధించిన ప్రశ్నలే ఇచ్చే వారని కానీ జాతీయస్థాయిల పరీక్షలలో లెక్కలు కూడా ఉంటాయని మన సైన్స్ విద్యార్థులు లెక్కలు ఎలా కడతారని ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రతిపాదనలకు తలూపిందన్నారు. ప్రజల సమస్యలు పట్టని వీరు తుగ్లక్ వారసులని విమర్శించారు. విద్యార్థులు చదవుతున్న సిలబస్ ఏమిటి వారు రాసే పరీక్ష ఏమిటని ప్రశ్నించారు.

జగన్ ఓదార్పులో భాగంగా గుంటూరు జిల్లాలోని చుండూరు, తెనాలి మండలాల్లో శుక్రవారం పర్యటించారు. రైతుల వెతల పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత అన్నింటి ధరలు పెరుగుతున్నాయన్నారు. వైయస్ బతికి ఉన్నప్పుడు రైతులకు కనీస మద్దతు ధర లభించేదని కానీ ఆయన తర్వాత రైతులు పూర్తిగా నష్టాల్లో కూరుకు పోతున్నారన్నారు. వైయస్ హయాంలో పేదవాడి ప్రాణాలకు భరోసా ఉండేదని, కానీ ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదని సమాధానం వస్తుందని విమర్శించారు. కాగా శుక్రవారం జగన్ ఓదార్పులో ఎమ్మెల్యేలు బాబూరావు, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
YSRC Party president, Kadapa MP YS Jaganmohan Reddy questioned how Bipc students count if medicine entrance conduct NEET.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X