వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల రాజీనామాలు: ఫలించని బొత్స బుజ్జగింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముగ్గురు పార్టీ శానససభ్యులు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీలో కలకలం ప్రారంభమైంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా తీసుకుంటోంది. పార్టీని వీడడానికి సిద్ధమైన శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలను బుజ్జగించడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగించడానికి ప్రయత్నించారు. పార్టీని వీడవద్దని ఆయన వారికి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ముగ్గురు శానససభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేస్తూ తమ లేఖలను ఫాక్స్ చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం కాంగ్రెసు పార్టీయే కారణమని రాజయ్య బొత్స సత్యనారాయణకు రాసిన లేఖలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు అధిష్టానం తన మాటను నిలబెట్టుకోలేకపోయిందని, తెలంగాణలో పార్టీ సర్వనాశనమైందని రాజయ్య అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడిచేందుకు తెలంగాణ కోసం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధపడ్డామని ఆయన చెప్పారు. తాము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కన్నా ప్రజల ఆకాంక్షే ముఖ్యమని ఆయన అన్నారు అంతకు ముందుకు తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, కెటి రామారావు కాంగ్రెసుకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం జూపల్లి కృష్ణారావు నివాసంలో జరిగింది.

English summary
Three MLA Jupalli Krishna Rao, Somnarapu Satyanarayana and Rajaih resigned for Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X