ఉచిత సలహాలొద్దు: వైయస్ జగన్ పార్టీకి చంద్రబాబు

Chandrababu Naidu
గుంటూరు: సంఖ్యాబలం లేని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమకు ఉచిత సలహాలు ఇవ్వడం తగదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైయస్సార్సీ పార్టీని ఉద్దేశించి పరోక్షంగా సోమవారం గుంటూరు జిల్లాలో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశాన్ని పార్టీ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. రైతుల సమస్యలను చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నైతికంగా కొనసాగే హక్కు ఏనాడో కోల్పోయాయయన్నారు.

రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకే 2వ తేది నుండి తాను రైతు పోరుబాట చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయం లాభసాటి కావాలని స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులపై లోతుగా చర్చ జరగాల్సి ఉందన్నారు. రాష్ట్రం మొత్తం అనారోగ్యం బారిన పడిందని ఎక్కడా లేని అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్య శాఖ నివారించలేక పోతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+