కారెక్కనున్న మరో ఆరుగురు టి - కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

కాంగ్రెసుకు షాక్ తగలడం ఖాయమని, మరో ఐదారుగురు శానససభ్యులు తమ పార్టీలోకి వస్తున్నారని, తగిన సమయంలో వారి పేర్లను వెల్లడిస్తామని తెరాస నాయకులు అంటున్నారు. మరింత మంది కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులు తమ పార్టీలోకి వస్తారని తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు ముగ్గురు శానససభ్యులను తన పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో చెప్పారు. అయితే ఆయన ఎంత మంది వస్తారనే విషయం చెప్పలేదు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసే కొద్దీ తమ పార్టీలోకి వలసలు పెరుగుతాయని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. కొత్తగా తెరాసలోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులు కూడా అదే విషయం చెబుతున్నారు.












Click it and Unblock the Notifications