హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ఎమ్మెల్యేలు అందుకే టిఆర్ఎస్‌లో చేరారు: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్/కరీంనగర్: కాంగ్రెసు పార్టీ నాన్చుడు ధోరణి వల్లే ఆ పార్టీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. ప్రజల ఒత్తిడి మేరకే మంత్రులు రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనలేదన్నారు. మంత్రుల రాజీనామాల కోసం ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. పార్లమెంటు సమావేశలు ప్రారంభమయ్యే సమయానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు నిర్లక్ష్యంతో కూడుకున్నవన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై బాష్పవాయు ప్రయోగాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయంలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రైతులు ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తెలంగాణ భవనంలో అన్నారు. తెలంగాణలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోతే ఆందోళన చేస్తామన్నారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతు యాత్రలు చేస్తే ఎవరూ నమ్మరన్నారు. మంత్రులే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళతామని సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు కరీంనగర్‌లో అన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram said today that congress mlas are interested to join in TRS with their party attitude on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X