వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ దీక్షలు: ఢిల్లీలో బాపూజీ, నల్లగొండలో కోమటిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat reddy-Konda Laxman Bapuji
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏడు రోజుల నిరవధిక నిరాహారదీక్షను మంగళవారం ఉదయం ప్రారంభించారు. కాగా, నల్లగొండ క్లాక్ టవర్ వద్ద మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గాంధీజీ సమాధి స్థలం రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. గంటపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం చేశారు. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్దకు చేరుకుని దీక్షను ప్రారంభించారు. బాపూజీ ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి ప్రాణహాని కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్షకు కూడా తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు.

కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్య ఆయనకు ఎదురుగా వచ్చారు. ఆయన నల్లగొండలోని ఆంజనేయ స్వామికి ప్రార్థనలు చేసిన తర్వాత దీక్షాస్థలికి చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద యెత్తున అనుచరులు నల్లగొండ క్లాక్ టవర్‌కు చేరుకున్నారు. అక్కడే ఆయన తన ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు.

English summary
Freedom fighter Konda Laxman Bapuji and Congress MLA Komatireddy Venkat reddy began fasts in Delhi and at Nalgonda respectively for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X