హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై సురేఖ ఫైర్, టిడిపికి మద్దతన్న జగన్ ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడినప్పటికీ అవిశ్వాసం మాట ఎత్తడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వేసే సభా సంఘంపై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు. చంద్రబాబు హయాం నుండి నేటి కిరణ్ కుమార్ రెడ్డి హయాం వరకు జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని ఆమె డిమాండ్ చేశారు.

పోలవరం టెండర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కెసిఆర్ కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్షిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల చేరిక అంటూ కెసిఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దతిస్తామని మరో జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి వేరుగా అనంతపురం జిల్లాలో అన్నారు. కాంగ్రెసుతో ఒప్పందం వల్లే బాబు అవిశ్వాస తీర్మానానికి వెనక్కి వెళుతున్నారన్నారు.

English summary
YSR Congress Party camp MLA Konda Surekha fired at TDP chief Nara Chandrababu Naidu today. She also blamed TRS chief K Chandrasekhar Rao also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X