సిఎం చెప్పినట్టు వింటా: శ్రీధర్ బాబు, జూపల్లికి జవాబు

తనకు తెలంగాణ ముఖ్యమే అలాగే అభివృద్ధి కూడా ముఖ్యమేనన్నారు. తెలంగాణ వచ్చే దాకా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోవాలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రూపాయికి టీ కూడా దొరకడం లేదని అలాంటిది కిలో బియ్యం ఇవ్వడం సాహసోపేతమన్నారు. డిసెంబరు తొలివారంలోగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి భయం లేదన్నారు. కాంగ్రెస్సే తెలంగాణ ఇస్తుందన్నారు. టిఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌లో పడేయాలని చూస్తోందని వారంతా ఒకే త్రాటిపై ఉన్నారన్నారు. ప్రతిపక్షం అవిశ్వాసం పెడితే ఎదుర్కొంటామన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడానికే అన్నారు.












Click it and Unblock the Notifications