పురంధేశ్వరి పిఎ సంతకం ఫోర్జరీ, చిక్కుల్లో యుపిఎ

మంత్రిత్వ శాఖ లెటర్ హెడ్‌పై మంత్రి తొలి పర్సనల్ అసిస్టెంట్ మండల కనకాజీ సంతకం ఫోర్జరీ జరిగింది. లెటర్ హెడ్‌పై బయటవాళ్లు ఎలా సంతకం ఫోర్జరీ చేస్తారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది లోపలివాళ్ల పాత్ర లేకుండా జరిగి ఉండదని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రింటైన అధికారిక లెటర్ హెడ్‌పై సంతకం ఫోర్జరీ జరిగిందని, మంత్రి కార్యాలయం నుంచి దాన్ని జారీ చేశారని, దానికి సంబంధించి తగిన డైరీ నెంబర్, సీల్ పాయింట్స్ ఉన్నాయని అధికారులు అంటున్నారు.
లేఖ హిందీలో టైప్ చేసి ఉంది. అయితే, మంత్రి కార్యాలయం నుంచి హిందీలో టైప్ చేసే సంప్రదాయం లేదని, అధికారిక పనులేవీ హిందీ భాషలో జరగవని కనకాజీ పోలీసులకు చెప్పారు. మంత్రి కార్యాలయంలోనివారెవరో దీనికి పాల్పడి ఉంటారని కనకాజీ అనుమానం వ్యక్తం చేశారు. తాను గ్రాంట్లు లేదా చెల్లింపులు జరపాలని అధికారికంగా ఎవరికీ చెప్పలేదని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications