చంద్రబాబు 'షేర్ల' వ్యవహారంపై హైకోర్టు విస్మయం

Chandrababu Naidu
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి కావడానికి తెరవెనుక సహకరించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కష్టాల్లో పడితే రిలయన్స్ గ్రూపునకు చెందిన నిమేష్ కంపానీతో ఆయనకు చెందిన మార్గదర్శి సంస్థలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీగా పెట్టుబడులు పెట్టించారని ఇందులో భాగంగా రూ.100 ముఖ విలువ గల షేరును రూ.5,28,630కి కొనిపించారని పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ మంగళవారం తన వాదన వినిపించడంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహన్ రావు విస్మయం వ్యక్తం చేశారట. నిజంగా ఇది భారతదేశంలోనే జరిగిందా? అని ఆశ్చర్య పోయారట. ఆ తర్వాత న్యాయమూర్తులు దీనికి సంబంధించిన ఆధారాలు మీ వద్ద ఉన్నాయా అని న్యాయవాదిని ప్రశ్నించగా ఆయన ఉన్నాయని సమాధానమిచ్చారు.

కాగా వైయస్ విజయమ్మ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే విజయమ్మ తరఫు న్యాయవాది షేర్లపై వివరించినప్పుడు వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా రూ.38 వేలుగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ వార్షికాదాయం ఒక్కసారిగా రూ.కోట్లకు చేరిందని ఆయన వాదించారు. విదేశాలకు హవాలా ద్వారా నిధులు మళ్లించి అక్కడి నుండి పెట్టుబడులు పెట్టించి పన్నులు ఎగ్గొట్టారని చెప్పారు. చంద్రబాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని చెప్పారు. చంద్రబాబుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌ల ఆస్తులపైనా విచారణ జరగాల్సి ఉందన్నారు. ఆయన వాదన విన్న తర్వాత విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+