మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి

రాజేంద్ర ప్రసాద్ ప్రతిక్షణం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం థ్రిల్లర్ అనే సినిమా నిర్మాణం జరుగుతోంది. అచేతనావస్థలో ఉన్న సత్యను రాజేంద్ర ప్రసాద్ మంగళవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని తన్వీర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.
సత్య మెట్ల మీది నుంచి పడిపోయిందని మొదట చెప్పిన రాజేంద్ర ప్రసాద్ ఉరేసుకుందని ఆ తర్వాత పోలీసులకు చెప్పాడు. సత్యవతి మెడపై గాయాలున్నాయి. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన కుటుంబం బోరబండలోని రహ్మత్ నగర్‌లో ఉంటుంది. కొన్నేళ్లుగా రాజేంద్ర ప్రసాద్‌తో సత్యకు అఫైర్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సత్య రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలోనే ఉంటుంది. ఇటీవల వారిద్దరి మధ్య పొసగడం లేదనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications