తెలంగాణపై స్పష్టంగా ఉన్నా, అక్కడా యాత్ర: బాబు

Chandrababu Naidu
కడప: తెలంగాణ అంశంపై తాను స్పష్టమైన వైఖరితో ఉన్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు తెలంగాణలోనూ తాను రైతు పోరు బాట నిర్వహిస్తానని ఆయన చెప్పారు. బుద్ధిలేని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వంతో రైతులు విసిగి పోయారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై గురువారం ధ్వజమెత్తారు. రైతు పోరుయాత్రలో భాగంగా ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉందని రైతులను దగా చేస్తుందని విమర్శించారు. రైతులు పోరాటాలకు సిద్ధమైతే తప్పితే న్యాయం జరగదన్నారు. రైతులంతా ఏకమై రోడ్డెక్కాలని అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్వామినాథన్ కమిటీ నివేదికను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌‍లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తే బాగుండదని హెచ్చరించారు. కాగా చంద్రబాబు ప్రతి ఊరిలో ఆగి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+