వైయస్ జగన్ ఇలాకాపై ఎమ్మెల్యే చిరంజీవి కన్ను

Chiranjeevi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయిన కడప జిల్లాపై తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కన్ను పడినట్లుగా కనిపిస్తోంది. పిసిసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే కడప డిసిసి అడగాలని మాజీ పిఆర్పీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓ వైపు కొత్త పిసిసి కార్యవర్గం కోసం కసరత్తు చేస్తుంటే, తనను నమ్ముకొని తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన వారికి అందులో చోటు దక్కించుకోవడం కోసం చిరంజీవి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బొత్స పిసిసి తన కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేయాలని గత కొంతకాలంగా భావిస్తున్నారు. ఆయన కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే సమయానికి తన వర్గానికి చెందిన వారి పేర్లను రెడీగా ఉంచాలని చిరు భావిస్తున్నారట.

రాష్ట్ర కార్యవర్గంలో ఏ పదవులు అడగాలనే దానిపైన చిరు వర్గం నేతలు సమాలోచనలు జరుపుతున్నారట. గత 2009 సాధారణ ఎన్నికల్లో పిఆర్పీకి అధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గాలు, జిల్లాల పైన చిరు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా తదితర జిల్లాల డిసిసి అధ్యక్ష పదవులను అడగాలని చిరు వర్గం భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా కడప జిల్లా డిసిసిని అడగాలని అభిప్రాయాలూ ఉన్నాయట. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కడప ప్రజలు చిరంజీవికి బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గంలో ఏ స్థాయిలో ఎన్ని పదవులు కోరాలి, ఆయా పదవులకు ఎవరెవరిని ప్రతిపాదించాలనే దానిపై చిరంజీవి, ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+