చంద్రబాబుకూ సిబిఐ విచారణ తప్పదా?

మణికొండలోని ఎమ్మార్ టౌన్‌షిప్‌లోని విల్లాలు, విల్లాల ప్టాట్లు, అపార్టుమెంట్ల అమ్మకాల్లో ఎపిఐఐసికి 4,310 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మనీ లాండరింగ్, ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్, పన్ను ఎగవేత, ప్రభుత్వాన్ని మోసం చేసే ఉద్దేశం వంటి అక్రమాలు జరిగినట్లు సిబిఐ ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ సంస్థలకు నల్లధనం ఏదైనా ప్రవహించిందా అనే కోణంలో కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో జగన్ బినామీల పేరు మీద, ఆయన భార్య భారతిరెడ్డి పేరు మీద, కెవిపి రామచందర్ రావు బంధువు కె. రఘు పేరు మీద విల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన బిపి ఆచార్యను మొదట ప్రథమ ముద్దాయిగా చేర్చారు.












Click it and Unblock the Notifications