వైయస్ జగన్‌పై తెలుగుదేశం నేతల ఎదురుదాడి

వైయస్ జగన్‌పై తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎర్రంనాయుడు, నామా నాగేశ్వరరావు కూడా విరుచుకుపడ్డారు. ఒఎంసి లీజు 2004లోనే ముగిసిందని, దాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే పునరుద్ధరించిందని ఎర్రంనాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడిని అనవసరంగా జగన్ రొచ్చులోకి లాగుతున్నారని ఆయన అన్నారు. తనను సాక్షిగానే సిబిఐ పిలిచిందని జగన్ సెల్ఫ్ డిక్లరేషన్ఇచ్చుకుంటే సరిపోదని ఆయన అన్నారు. ఒఎంసి అక్రమాలకు బాధ్యుడు వైయస్ జగనే అని తెలుగదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలోనే ఎమ్మార్ కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. కోనేరు ప్రసాద్ సోదరుడు కోనేరు రవీంద్రనాథ్‌కు చెందిన భవనంలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం ఉండడం అందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. కోనేరు ప్రసాద్ వైయస్సార్ ప్రభుత్వ హయాంలోనే స్టైలిష్ హోమ్‌ను స్థాపించాడని ఆయన చెప్పారు. చంద్రబాబు వైయస్ జగన్ కలలోకి వస్తున్నాడని ఆయన అన్నారు.
మరో తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు కూడా జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి, చంద్రబాబుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. ఆర్ఆర్ గోల్డ్, రెడ్ గోల్డ్ నుంచి సాక్షిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయే జగన్ చెప్పాలని ఆయన విశాఖపట్నంలో డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications