పెద్దల కోసం ఆ ఇద్దరు కోట్లు అడిగారు: శశికుమార్

గనుల లీజులకు సంబంధించి వంద తప్పులు తాను చూపిస్తానని ఆయన చెప్పారు. రాజగోపాల్, శ్రీలక్ష్మిలను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆయన అన్నారు. అక్రమాలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తనకు గనులు లీజుకు ఇవ్వడానికి సాకులు చూపిన అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి అక్రమంగా లీజుకు ఇచ్చారని ఆయన చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తాను 25 సార్లు మొర పెట్టుకున్నానని ఆయన చెప్పారు. రాజగోపాల్, శ్రీలక్ష్మి తనను బెదిరించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications