ఎమ్మార్ - ఎంజిఎఫ్ బాస్ గుప్తాకు సిబిఐ షాక్

అత్యవసరంగా తాను హాజరు కావాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయని, ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గుప్తా పదే పదే కోరినా సిబిఐ అధికారులు నిరాకరించారని తెలుస్తోంది. తన వెంట చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ)ను తీసుకురాకపోవడంతో ఆయన ఈ చిక్కుల్లో పడాల్సి వచ్చిందని అంటున్నారు. గుప్తాను సిబిఐ అధికారులు రోజంతా విచారించారని, ఎంతగా ప్రశ్నించినా తనకు ఏమీ తెలియదని, సిఎకే అన్నీ తెలుసునని సమాధానం ఇస్తూ పోయారని అంటున్నారు. సిఎనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతాడని గుప్తా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
గుప్తా తీరుకు విసిగిపోయిన సిబిఐ అధికారులు సిఎను ఇక్కడికి పిలవాలని చెప్పారని అంటున్నారు. అయితే, సిఎ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, నాలుగైదు రోజుల వరకు రాలేడని చెప్పి నేను వెళ్లవచ్చునా అని గుప్తా అడిగినట్లు తెలుస్తోంది. సిఎ తమ ముందుకు వచ్చే వరకు హైదరాబాదులోనే ఉండాలని సిబిఐ అధికారులు నిక్కచ్చిగా గుప్తాకు చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications