ఫేస్‌బుక్‌కి ఇండియా అతి పెద్ద యూజర్ డేటాబేస్ కాబొతుందా..

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ వాడేటటువంటి యూజర్స్ స్దానంలో ఇండియా మూడవ స్దానంలో ఉంది. ఇండియాలో ఫేస్‌బుక్ యూజర్స్ ప్రతి సంవత్సరానికి గాను 84శాతం అభివృద్ది చెందుతుండగా, ఇప్పటికి ఇండియాలో ఫేస్‌బుక్ ఎకౌంట్లు కలిగిన వారి సంఖ్య 34మిలియన్లు. అదే ఇండోనేషియాలో 45మిలియన్లు. జనాభాని బట్టి చూస్తే ఫేస్‌బుక్ త్వరలో అమెరికాని, ఆ తర్వాత ఇండోనేషియాని అధిగమిస్తుందని ఫేస్‌బుక్ నిపుణులు అభిప్రాయపడుతున్నా రు.
ఫేస్‌బుక్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఫేస్‌బుక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమయొక్క డెస్కటాప్‌ల కంటే కూడా మొబైల్స్‌లలోనే ఎక్కవ సార్లు లాగిన్ అవుతున్నట్లు తెలిపింది. దీనిని బట్టి పేస్‌బుక్ రాబోయే కాలంలో బేసిక్ మోడల్స్‌లలో కూడా ఫేస్‌బుక్ బటన్‌ని నిక్షిప్తం చేసేందుకు గాను తైవాన్ ఛిప్ మేకర్ మీడియా టెక్‌తో చేతులు కలిపింది. మీడియా టెక్ సహాయంతో ఫేస్‌బుక్ ఇండియాలో మైక్రోమ్యాక్స్, స్పెస్ మొబైల్స్‌లలో ఫేస్‌బుక్‌ని తప్పని సరిగా ఇమిడికృతం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
అంతేకాకుండా ప్రత్యేకంగా ఫేస్‌బుక్ కొసం కూడా మొబైల్ ఫోన్స్‌ని తయారు చేస్తున్నారు. హెచ్‌టిసి ఛాచా, మైక్రోమ్యాక్స్ త్వరలో ఫేస్‌బుక్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టనున్నాయి. వీటి ధర సుమారుగా రూ 5,000ల కంటే తక్కవగా ఉండేటట్లు నిర్ణయం తీసుకొనున్నారు.












Click it and Unblock the Notifications