సిక్కింలో బినామీ పేర్లతో వైయస్ జగన్ పెట్టుబడులు?

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిక్కిం రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టినట్లుగా ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అక్రమాస్తుల కేసులో జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సిబిఐ ఈశాన్య రాష్ట్రాల్లో యువనేత పెట్టుబడులపైనా దృష్టి సారించిందని పేర్కొంది. సిక్కింలో రెండు విద్యుత్ ప్రాజెక్టులను బినామీ పేర్లతో జగన్ నిర్మిస్తున్నారన్న ఆరోపణలు చాన్నాళ్లుగా ఉన్నాయి. గ్యాంగ్‌టక్ వాసి ఆనంద్ లామా సిక్కిం హైకోర్టులో తాజాగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో ఈ ప్రాజెక్టుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో జగన్ ఆక్రమాస్తులపై సమగ్ర విచారణ జరుపుతున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం సిక్కింలోని అక్రమ విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారంపైనా దర్యాప్తునకు సిద్ధమవుతోందట.

త్వరలో హైదరాబాద్ నుంచి సిబిఐ బృందం ఒకటి సిక్కిం వెళ్లనున్నట్లుగా సమాచారం. 1200 మెగావాట్ల సామర్థ్యం గల తీస్తా మూడో దశ జల విద్యుత్ ప్రాజెక్టును ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్ వద్ద నిర్మిస్తున్నారు. తీస్తా ఊర్జా లిమిటెడ్ అనే సంస్థ దీని నిర్మాణాన్ని చేపడుతోంది. అలాగే డ్జోంగు వద్దనున్న లెప్చా రిజర్వ్ ప్రాంతంలో 99 మెగా వాట్ల సామర్థ్యంతో పనాన్ హైడ్రో పవర్ ప్రాజెక్టును హిముర్జా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్మిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకూ అవసరమైన పెట్టుబడి జగనే సమకూరుస్తున్నారని గ్యాంగ్‌టక్ వాసి ఆనంద్ లామా చెబుతున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో పలు ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ సిక్కిం హైకోర్టులో ఆయన పిల్ దాఖలు చేశారు. ఆర్థిక అక్రమాలపై విచారణ జరపాలని కోర్టును కోరారు.

జగన్ అక్రమ పెట్టుబడులపై సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పలు కీలక పత్రాలను తన ఆరోపణలకు మద్దతుగా కోర్టుకు లామా సమర్పించారు. ఈ సమాచారంతో లామా సిబిఐని ఆశ్రయించారు. సిక్కింలో జగన్ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆర్థిక అక్రమాలను ఆరా తీయాలంటూ సిబిఐ డైరెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సిబిఐ జెడి లక్ష్మీనారాయణ గత నెల 10వ తేదీన లామాకు లేఖ రాశారు. సిక్కింలోని ప్రాజెక్టుల సమగ్ర సమాచారాన్ని సిబిఐ హైదరాబాద్ శాఖకు అందించాలని ఆ లేఖలో కోరారు. ఆయన కూడా సమగ్ర సమాచారం అందిచారట. సిక్కింలో జగన్ పెట్టుబడులు రూ.200 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+