రాజీనామాలపై అసెంబ్లీ లోపు స్పీకర్ నిర్ణయం

Nadendla Manohar
హైదరాబాద్: శాసనసభ్యులు చేసిన రాజీనామాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వచ్చే శాసనసభ శీతాకాలం సమావేశాల లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీనామాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాజీనామాల వ్యవహారంపై ఆయన వచ్చే వారం నుంచి కసరత్తు ప్రారంభిస్తారని అంటున్నారు. దాదాపు 78 మంది శాసనభ్యుల రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగులో ఉన్నాయి. చాలా కాలంగా ఆయన వాటిని పెండింగులో పెట్టారు.

తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు రెండో సారి రాజీనామాలు చేశారు. తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో పాటు నలుగురు తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభా సభ్యత్వాలకు పార్టీకి రాజీనామాలు చేశారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేశారు. వారు కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన ఒక్కో శాసనసభ్యుడిని పిలిపించి మాట్లాడి రాజీనామాలపై స్పీకర్ మనోహర్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+